17-05-2025 12:00:00 AM
బోర్డు ఏర్పాటు చేసి వదిలేసిన కేంద్రం: రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): కేంద్రప్రభుత్వం నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేసినా.. పసుపు పంటకు గిట్టుబాటు ధర అందక పసుపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో పసుపు పంటకు ఎక్కువగా ధర వస్తుందన్నారు. కోదండరెడ్డి శుక్రవా రం బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పండించే పసుపులో ‘కురుకుమిన్’ శాతం తక్కువగా ఉందని, కురుకుమిన్ శాతం ఎక్కువగా ఉండే విత్తనాలు అందుబాటులో లేక పోవడమే దీనికి ప్రధాన కారణమన్నారు.
కేరళ ఏ రోడ్ అనే లభించే విత్తనంలో కురుకుమిన్ శాతం ఎక్కువగా ఉంటుందని తెలి పారు. భూమి నుంచి పసుపు తీయడం, ఉడకబెట్టడం, పాలిష్ చేయడంలో యంత్రపరిక రాలు అవసరమని, ఆధునికయంత్రాలను కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించాలని, ప్రాసెస్ ఇండస్ట్రీస్ కోసం కృషి చేయాలని కోరారు. కమిషన్ సభ్యులు భవానీరెడ్డి మా ట్లాడుతూ.. రాష్ట్రంలో కల్తీ విత్తనం రాజ్యమేలుతుండటంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు.
రాష్ట్రంలో విత్తన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 1966 లో కేంద్రం చేసిన విత్తన చట్టం, 2007లో చేసిన పత్తి విత్తన చట్టాలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయని, కొత్త విత్తన చట్టం తేవాలని 2004 నుంచే ప్రతిపాదనలు ఉన్నాయని కమిషన్ సభ్యులు భూమి సునీల్ అన్నారు.