కూసుమంచి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల ధర్నా
కూసుమంచి, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల సాధన కొరకై దశల వారి ఉద్యమంలో భాగంగా మండల కేంద్రంలోని కూసుమంచి మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన మెమోరాండం సమర్పించడం జరిగింది.
గతంలో అనేక దాఫాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులతో ప్రభుత్వంలోని పెద్దలు, ముఖ్యమంత్రి అనేక రకాల హామీ ఇస్తూ పెండింగ్ డిఏలు, పిఆర్సి సాధన,సిపిఎస్ రద్దు, హెల్త్ కార్డు మంజూరు తదితర అనేక సమస్యలపై హామీలిచి నేటి వరకు అమలు చేయకపోవడం వలన ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గంలో తీవ్ర నిరాశాన్ని,స్పృహ కలిగి ఉన్నది.
ఈ విషయమై ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఐక్య ఉద్యమాలుగా ఏర్పడి సమస్యల సాధన కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కూసుమంచి మండల ఉపాధ్యాయ సంఘాల నాయకులు భద్ర నాయక్, నరసయ్య,యాకయ్య, శ్రీనివాస్ వివిధ సంఘాలలో ఉన్నటువంటి సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై నిరసన ప్రదర్శన, మెమోరాండం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.






