13-07-2025 12:41:22 AM
- 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారి ఏర్పాటు
- 13 మందితో మొదటి బృందం
- త్వరలోనే మరో టీం ఏర్పాటు:- సీఎండీ బలరాం నాయక్
మంచిర్యాల, జూలై 12 (విజయక్రాంతి): 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా రెస్క్యూ టీంలోకి మహిళ ఉద్యోగులు వచ్చారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న మొట్ట మొదటి మహిళా రెస్క్యూ టీం సభ్యులకు సీఎండీ బలరాంనాయక్ సర్టిఫికెట్లు సైతం అంద జేసి ప్రోత్సహించారు. సింగరేణి రెస్క్యూ బృందాలు ఇటీవల శ్రీశైలం ప్రమాద సమయంలోనూ, హైదరాబాద్ పాశమైలారం అగ్ని ప్రమాద దుర్ఘటనలో, తమి ళనాడులో జరిగిన ప్రమాదంలోనూ విశిష్ట సేవలను అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. సింగరే ణి రెస్క్యూను బలోపేతం చేయడానికి సింగరేణి యాజమాన్యం అత్యాధునిక సహాయ పరికరాలను సమ కూర్చడమే కాకుండా రామగుండం-2 ఏరియాలో ఉన్న మైన్స్ రెస్క్యూ స్టేషన్‌ను రెస్క్యూలో ప్రపంచ స్థాయి శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.
13 మందితో తొలి రెస్క్యూ టీం
సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ నాయక్ ఆదేశాలతో సింగరేణి జీఎం (రెస్క్యూ) శ్రీనివాసరెడ్డి సింగరేణి సంస్థలో తొలిసారిగా 13 మంది మహిళా అధికారుల తో ప్రెస్క్యూ టీంను తయారు చేశారు. ఎంపిక చేసిన బృందానికి 14 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అన్ని రకాల శిక్షణలలో మగవారికి ఏ మాత్రం తీసి పోకుండా మహిళా అధికారులకు శిక్షణ ఇప్పించడంతో మహిళలు సైతం వారి శక్తి సామర్థ్యాలకు మించి ప్రతిభ కనబరిచారు. మరో మహిళా రెస్క్యూ టీమ్ తయారు చేసే పనిలో సంబంధిత అధికారులు నిమగ్నమయ్యారు.
జాతీయ, అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు..
సింగరేణిలో మొదటి మహిళా రెస్క్యూ జట్టుకు రెస్క్యూ ట్రైనర్‌లు తిరుపతి, కిషన్ రావు, సందీప్, సాజి ద్ అలీ ప్రత్యేక శిక్షణ అందించారు. ప్రమాదాల సమయాల్లో, సేవా కార్యక్రమాల్లో మహిళా రెస్క్యూ జట్టు తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకునేలా తర్ఫీదును ఇచ్చారు. అంతేకాకుండా త్వరలో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో జరిగే రెస్క్యూ పోటీల్లో పాల్గొనేలా బృందాన్ని సిద్ధం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర, కేంద్ర విపత్తు ప్రతిస్పందన బృందాలకు సింగరేణి రెస్క్యూ స్టేషన్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఆదర్శంగా నిలవాలి
సింగరేణి చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి రెస్క్యూ టీంను తయారు చేయడం గర్వించదగ్గ విషయం. మహిళా రెస్క్యూ జట్టు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకొని ఇతర బృందాలకు గట్టి పోటీ ఇవ్వాలి. నైపుణ్యం, కృషి, అంకితభావంతో ఉత్తమ సేవలు అందించాలి. త్వరలోనే మహిళలతో మరో రెస్క్యూ టీమ్ ను తయారు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశాం.
సీఎండీ బలరాం నాయక్