22-01-2026 12:00:00 AM
తెలంగాణ మీసేవ మొబైల్ యాప్‌లోని టెంపుల్ ఆన్‌లైన్ సర్వీసెస్ విభాగంలో ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన ట్యాబ్ ఓపెన్ కావడం లేదు. ఈ ట్యాబ్ ద్వారా దేవాలయాలకు సంబంధించిన పూజా వివరాలు, సేవల సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కానీ ప్రస్తుతం సాంకేతిక లోపం కారణంగా అనేక మంది భక్తులు, వినియోగదారులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. కావున, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ సాంకేతిక సమస్యను తక్షణమే పరిష్కరించి, మీసేవ యాప్ అన్ని విధాలుగా సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజల తరఫున తెలంగాణ ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుతున్నాను.
సివిఆర్ కృష్ణ, హైదరాబాద్