13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్‌గా తీగల సునీంద్ర

16-02-2026 12:51 PM

వైస్ చైర్మన్‌గా బాదం రమేష్ నియామకం. 

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్‌గా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీగల సునీంద్రను, 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాదం రమేష్ ను వైస్ చైర్మన్‌గా  నియమిస్తూ ఎన్నికల అధికారి ఆర్డీఓ సురేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున బి ఫామ్ జారీ చేయగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ సురేష్ ప్రకటించారు. అంతకుముందు 24 వార్డుల నూతన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ నిర్ణయంతో స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లు పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.