14-07-2025 12:00:00 AM
బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్
కరీంనగర్, జూలై 13 (విజయ క్రాంతి): మహిళా సమాజానికి క్షమాపణ చెప్పకపోతే తీన్మార్ మల్లన్న నాలుక కోస్తామని బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవిత మీద చేసిన అనుచిత మైన వ్యాఖ్యలను ఖండిస్తూ కవిత అభిమానులు, జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు నిరసన తెలపడానికి తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వెళ్తే తన గన్ మెన్ లతో ఫైరింగ్ చేయించి గాయా పరచారని పేర్కొన్నారు.
ఇది ఒక్క కవిత విషయం కాదని, యావత్ మహిళ సమాజానికి కించపరిచే విధంగా తీన్మార్ మల్లన్న మాటలు ఉన్నాయని, వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి లేకపోతే తీన్మార్ మల్లన్న నాలుక కోస్తామని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.