calender_icon.png 14 July, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరివిలాసం పుస్తకావిష్కరణ

14-07-2025 12:00:00 AM

కరీంనగర్, జూలై 13 (విజయ క్రాంతి): ప్రముఖ కవి, రిటైర్డ్ టీచర్ అడ్లూరి జనార్ధన్ రాజు రచించిన హరి విలాసం పుస్తకాన్ని రిటైర్డ్ డీఈవో రామేశ్వర్ రాజు, మాజీ కార్పొరేటర్ కొండపల్లి సరిత-సతీష్ లు ఆవిష్కరించారు. నగరంలోని విద్యానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శతక సాహిత్యం తో విశేషంగా చేస్తున్న సేవలను గుర్తించి.. సాహితి మిత్రబృందం అడ్లూరు జనార్ధన్ రాజుకు శత సాహిత్య శేఖర బిరుదును ప్రధానం చేశారు..

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ జయవీర్ రాజు, జీవన్ రాజు, బాపిరాజు, భాస్కర్ రాజు, గోవర్ధన్ రాజు, సురేందర్ రాజు, బాలచందర్ రాజు, బ్రహ్మం, దూలూరి సత్యనారాయణ రెడ్డి, గంప సత్యనారాయణ, కవులు, రచయితలుపాల్గొన్నారు.