calender_icon.png 14 July, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనాడు తప్పులు చేసిందే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు

14-07-2025 12:57:15 PM

  1. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్ పట్టించుకోలేదు.
  2. పాలేరు నుంచి నీళ్లు విడుదల చేసిన డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి. 

హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు జలాశయం నుంచి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే.. వ్యవసాయం, కరెంట్, ప్రాజెక్టులు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పట్టించుకోలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. ఆనాడు తప్పిదాలు చేసిందే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అన్నారు. తప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.