తీన్మార్ మల్లన్నను గెలిపించాలి
25-05-2024 03:50 AM
సూర్యాపేట, మే 24 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన జిల్లాకేంద్రంలోని గ్రంథాలయంలో ఉద్యోగార్థులను ఓట్లు అభ్యర్థించారు. నిరుద్యోగ సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుందన్నారు. ప్రచారంలో పార్టీ నేతలు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, వేణారెడ్డి పాల్గొన్నారు.






