11 August, 2026 | 3:02 PM

Breaking News

కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

25-05-2024 03:57 AM

హనుమకొండ, మే 24 (విజయక్రాంతి): కాకతీయ, ఉస్మానియా, ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివిన పట్టభద్రులను పల్లీ బఠాణీలతో పోల్చిన మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. పట్టభద్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కేయూ మొదటి గేట్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జేఏసీ నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్, తాళ్లపల్లి నరేశ్‌గౌడ్ పాల్గొన్నారు.