పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ ఘన విజయం
మహబూబాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి):మహారాష్ట్రలోని నాగపూర్లో మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీస్ విభాగం ఆంటీ సబోటేజ్ చెక్ విభాగంలో విశేష ప్రతిభ కనబరిచింది. ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి యాక్సెస్ కంట్రోల్ విభాగంలో సిల్వర్ మెడల్, వీవీఐపీ రూమ్ సెర్చ్ విభాగంలో గోల్ మెడల్, వీవీఐపీ వెహికిల్ సెర్చ్ విభాగంలో గోల్ మెడల్ దక్కాయి.
ఈ విజయంతో తెలంగాణ రాష్ట్రానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా, నాలుగు నెలల పాటు చీఫ్ కోచ్ ఎం. రామకృష్ణ (ఎస్పీ, 8వ బెటాలియన్, కొండాపూర్) ఆధ్వర్యంలో కఠిన శిక్షణ అందించబడగా, తెలంగాణ రాష్ట్రం ఆల్ ఇండియా ఓవరాల్ ఛాంపియన్షిప్ను సాధించడం వరుసగా మూడవసారి కావడం విశేషం. ఈ విజయానికి తోడ్పడిన మహబూబాబాద్ జిల్లా బీడీ టీం విభాగానికి చెందిన కోచ్ కే.అంజయ్యను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ ఎం. శ్రీనివాస్, ఆర్.ఐలు సోములు, టీ. నాగేశ్వర్ రావు, ఆర్.ఎస్.ఐ జీ. శేఖర్ పాల్గొన్నారు.




