calender_icon.png 5 July, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయండి..

05-07-2025 05:48:01 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్..

ఉట్నూర్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీవీటీజీలు కోలాం, తోటిలు, చెంచులు, కొండరెడ్లు ఐటీడీఏ సీసీడీపీ ద్వారా నిర్మించుకున్న ఇండ్ల నిర్మాణ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ. 16,43,87000 త్వరగా విడుదల చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పివిటీజీ లు అప్పులు చేసి ఇండ్లను నిర్మించారని, త్వరగా నిధులను విడుదల చేయాలని కోరారు. దీంతో నెల రోజుల్లోగా నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని వారు తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావు తదితరులు ఉన్నారు.