05-07-2025 05:54:59 PM
సంతాపం తెలిపిన మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ ప్రెసిడెంట్ పడాల వెంకటస్వామి సతీమణి చేవెళ్ల మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ పడాల యాదమ్మ శుక్రవారం అనారోగ్యంతో చనిపోవడం పట్ల మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) సంతాపం తెలిపారు. శనివారం చేవెళ్ల మండలం ముడిమ్యాలలోని యాదమ్మ స్వగృహంలో ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాదమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. యాదమ్మ మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఎంపీపీగా, జడ్పీటీసీగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి పామెన భీమ్ భరత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పడాల రాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పెద్దొళ్ల ప్రభాకర్, గోవర్ధన్ రెడ్డి, దారెడ్డి వెంకటరెడ్డి, నేతలు కొంపల్లి అనంతరెడ్డి, దేశమోళ్ల ఆంజనేయులు, గోనె కరుణాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు యాదమ్మ మృతదేహానికి నివాళి అర్పించారు.