calender_icon.png 5 July, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

05-07-2025 05:50:02 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(MLA Dr. Palvai Harish Babu) పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలో ఎమ్మెల్యే నివాసం వద్ద మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు, చిన్నారులతో కలసి బిజెపి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలలో బిజెపి పార్టి జిల్లా అధ్యక్షుడు ధోనీ శ్రీ శైలం, పట్టణ అధ్యక్షుడు  శివకుమార్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.