26-07-2025 01:24:23 AM
కామారెడ్డి/ఎల్లారెడ్డి, జూలై 25 (విజయ క్రాంతి): కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ ర్శించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేటలో నిర్వహించిన ఆత్మగౌరవ గర్జనసభకు కేటీఆర్ హాజరై మాట్లాడారు. లింగంపేటలో అంబేద్కర్ జయం తి రోజు తమ పార్టీ నాయకుడు సాయిలుకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.
బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఘనంగా గౌరవిం చింది మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరే అని చెప్పారు. దళితులకు దళితబంధు, మూడు ఎకరాల భూ పంపిణీ చేసిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం దేశంలో ఎక్కడ ఏర్పాటు కాలేదని, హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ సాధనకు రాజ్యాంగం దిక్సూచి కావడంతో కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామని గుర్తుచేశారు.
రైతుల డబ్బులు రాహుల్ ఖాతాలోకి
ఇక్కడి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రాహుల్‌గాంధీ ఖాతాలకు వెళ్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారం లో ఉన్నప్పుడు కరోనా వ్యాధి మహమ్మారి వచ్చినప్పటికీ కేసీఆర్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తుచేశారు. ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుబంధు హామీలను తుంగలో తొక్కి ఎగనామం పెట్టిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం అరకొ రగా డబ్బులు ఇచ్చి రైతులను సంబురాలు చేసుకోవాలని అన్నారని ఆరోపించారు.
ఆరు గ్యారెంటీల అమలేది?
ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా అని కేటీఆర్ సభ సాక్షిగా ప్రజలను ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆడబిడ్డలను, పిల్లలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వసతి గృహాల్లోని పిల్లలకు సరిగా తిండి పెట్టలేని పరిస్థితి ఉందని అన్నారు. తులం బంగారం,ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్ రెడ్డి ఇచ్చానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సర్కారు నడిపేటోనికి దమ్ముంటే ఆదాయం పుడుతుంది, పనులు కూడా అవుతాయన్నారు. గురుకులాల్లో విషం పెడుతున్నారని, వందల మంది పిల్లల ప్రాణాలు తీర్చారని ఆరోపించారు. 6.50 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. ప్రపంచ సుందరాంగులకు లక్ష రూపాయల ప్లేటు భోజనం పెట్టారని విమర్శించారు.
అంతకుముందు లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలును కేటీఆర్ పరామర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, జడ్పీ మాజీ చైర్మన్ దఫెదర్ రాజు , జూకంటి ప్రభాకర్ రెడ్డి, గాంధారి, ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, సదాశివ నగర్ మండలాల నాయకులు పాల్గొన్నారు.
దళిత డిక్లరేషన్ ఏమాయే?
కాంగ్రెస్ ప్రభుత్వం దళిత డిక్లరేషన్‌లో ప్రకటించింది ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడుదామని పిలుపునిచ్చారు. దళితుల వ్యతిరేక ప్రభు త్వం కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని మండిపడ్డారు.
దళిత బంధు కొనసాగిస్తామని చెప్పిన ప్రభుత్వం దళిత కుటుంబాలకు 12 లక్షల ఇస్తామని ఇచ్చారా అని ప్రశ్నించారు. మీరు ఏ ఎక్కడ కూర్చుండమంటే ఆడ కూసుంటాను అన్న తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని.. మాకేం నష్టం లేదు, బాధా లేదు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.