calender_icon.png 4 August, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

04-08-2025 11:58:57 AM

మానుకోట వాసులకు తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం 

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ కు చెందిన తాపీ మేస్త్రి పని చేసే సుమారు 20 మంది శ్రీశైలం(Srisailam) వెళ్ళి  దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో  వారు ప్రయాణం చేస్తున్న మినీ బస్ ఈ రోజు తెల్లవారు జామున  3 గంటల ప్రాంతంలో సూర్యాపేట(Suryapet) సమీపంలో  బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.