calender_icon.png 4 August, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి ముర్రుపాలే బిడ్డకు ఆరోగ్య రక్ష

04-08-2025 12:00:39 PM

మహదేవపూర్, (విజయక్రాంతి): తల్లి ముర్రుపాలే బిడ్డకు ఆరోగ్య రక్ష అని 4వ అంగన్వాడి కేంద్రం టీచర్ గావిడి సునీత అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండల కేంద్రంలోని 4వ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సునీత మాట్లాడుతూ బిడ్డ జన్మించిన గంటలోపే తల్లి ముర్రుపాలు బిడ్డకు పట్టిస్తే జీవితాంతం రక్షణగా ఉంటుందని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కై ముర్రు పాల ను బిడ్డకు పట్టించాలని తెలిపారు. పిల్లల తల్లులకు, గర్భిణీ స్త్రీలకు ముర్రు పాల పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు, ప్రేమలత, రమాదేవి, నాశ్రీన్ బేగం, శిరీష, ప్రియాంక, స్రవంతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.