04-08-2025 11:47:06 AM
హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) నిరాహార దీక్షకు దిగారు. బీసీ రిజర్వేషన్ల పెంపు సాధన కోసం కవిత 72 గంటల నిరాహార దీక్షకు పూనుకున్నారు. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు. జై తెలంగాణ, జైపూలే, జై బీసీ, జైహింద్ నినాదంతో కవిత దీక్షను ప్రారంభించారు. దీక్ష ప్రారంభించే ముందు కవత తన నివాసంలో పూజలు చేశారు. అనంతరం భర్త అనిల్ తో కలిసి అత్తమామలు దేవనపల్లి రాంకిషన్ రావు, నవలత దంపతుల ఆశీర్వచనం తీసుకున్నారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కవిత దీక్ష చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టే 72 గంటల నిరాహారదీక్ష సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కవిత నివాళులర్పించారు. నిరాహారదీక్షలో పాల్గొనేందుకు వెళ్తూ మార్గమధ్యలో మింట్ కాంపౌండ్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలకు పుష్పాంజలి ఘటించిన ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు.