calender_icon.png 10 October, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీకి ఝలక్

10-10-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నాయకులు 

తాండూరు, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది . వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు నారాయణ తో పాటు దాదాపు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి మాజీ ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

పెద్దెముల్ మండలం ఎర్రగడ్డ తండాకి చెందిన కాంగ్రెస్ నాయకులు మరియు మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు నారాయణ, నాయకులు లక్ష్మణ్, శివ, వెంకటేష్, శంకర్ జాదవ్, సురేష్, వీరేందర్, మోహన్ సింగ్, సేవ్లా, గోపాల్, రాము, జగన్, మాజీ వార్డ్ మెంబర్ గోబ్య్ర,  వినాయక్,  సజని బాయి, నాయకులు థౌర్యా, హీరసింగ్, లతో పాటు యువకులు మహిళలు పార్టీలో చేరారు.  వారికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ లో చేరిన నాయకులు మాట్లాడుతూ 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నామని ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా పార్టీని విడలేదని కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వచ్చాక  కొందరు నాయకులు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విరక్తి చెందామని వారు తెలిపారు. అనంతరం రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని ప్రజలకు మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి త్వరలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.