calender_icon.png 17 January, 2026 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గృహజ్యోతి పథకంతో 52,82,498 మందికి లబ్ధి..

17-01-2026 02:38:42 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని వాడి, మాసానిపల్లి, మార్టూరు గ్రామాలలో గృహ జ్యోతి పథకం కింద లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్కో సిబ్బంది ద్వారా లబ్ధి పొందుతున్న వినియోగిస్తున్న లబ్ధిదారుల పత్రాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా నాగిరెడ్డిపేట మండలంలోని వాడి గ్రామంలో మండల విద్యుత్ శాఖ అధికారి నాగరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యుత్ శాఖ అధికారి నాగరాజు మాట్లాడుతూ... రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద అందిస్తున్న లబ్ధిని వివరిస్తూ పొందుపరిచిన పత్రాన్ని వినియోగదారులకు అందజేస్తున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 52,లక్షల 82 వేలు,,498 లబ్ధిదారులు గృహ జ్యోతి పథకంలో లబ్ధిపొందుతున్నారన్నారు.వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 3,593 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.గృహజ్యోతిలో మినహాయించిన మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలన్నారు. లబ్ధిదారుడి పేరు గృహజ్యోతి సర్వీస్ నెంబర్ ఉన్న ఈ పత్రాన్ని లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు.