calender_icon.png 30 July, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

18-09-2024 03:35:54 PM

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. శీతాకాల పార్లమెంట్ సమవేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. చంద్రయాన్-4, గగన్ యాన్, శుక్రయాన్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది.