calender_icon.png 2 October, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మహత్యల తెలంగాణ.. అన్నపూర్ణగా

02-10-2025 12:40:38 AM

ఆదర్శ పథకాలతో మార్చేసిన కేసీఆర్

జాతీయ నేర గణాంక నివేదిక కాంగ్రెస్‌కు చెంపపెట్టు

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): రైతు ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చిందే కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచే రైతు సంక్షేమ పథకాలు ప్రారంభించి సాగును బాగు చేసిందే కేసీఆర్ అని తెలిపారు. జాతీయ నేర గణాంక నివేదిక లెక్కలు కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు అని పేర్కొంటూ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు.

తెలంగాణ లో 2014లో 1,347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2023 నాటికి 56కి తగ్గాయని, 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14వ స్థానానికి పరిమితమైందని స్పష్టం చేశారు. 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో తెలంగాణ వాటా కేవలం 0.51 శాతం మాత్రమేనని, 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహ త్యలు రికార్డు స్థాయిలో 95.84 శాతం తగ్గాయని పేర్కొన్నారు.

ఇవి మాటలు కాదు, కేసీఆర్ తిరగరాసిన రికార్డులు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెపుతున్న వాస్తవాలని స్పష్టం చేశారు. తెలం గాణను అన్నం గిన్నెగా దేశానికే ఆదర్శంగా నిలిపింది కేసీఆర్ అని గుర్తు చేశారు. కేసీఆర్ పాలన గురించి నోరు పారేసుకునే వారికి ఇది చెంపపెట్టు సమాధానమని తెలిపారు. కేసీఆర్‌కు రైతుకు ఉన్నది పేగు బందం, ఆత్మ బంధం అయితే, కాంగ్రెస్‌కు ఉన్నది కేవలం ఓటు బంధమని పేర్కొన్నారు.