20-09-2025 01:24:42 PM
మహిళలు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన పనిచేదు
మహిళలను కోటీశ్వరులను చేయడం మా లక్ష్యం
హైదరాబాద్: ఐదేళ్లలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) హైదరాబాద్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో స్పష్టం చేశారు. వడ్డీ లేని రుణాల(Vaddi Leni Runalu) చెక్కుల పంపిణీ విక్రమార్క పంపిణీ చేశారు. మహిళలను కోటీశ్వరులను చేసేవిధంగా ప్రభుత్వం కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని సూచించారు. మహిళలను ఇప్పటికే 150 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని చెప్పారు. మరో 450 ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేయబోతున్నామని ప్రకటించారు. మహిళలు ఇక వడ్డీవ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని వివరించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 7,422 కోట్లు చెల్లించిందని వెల్లడించారు. 96 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందించామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 41 వేల రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. వడ్డీలేని రుణాలతో మహిళలు వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు.