calender_icon.png 20 September, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్టర్ సిరిగిరి రమేష్ దారుణ హత్య

20-09-2025 01:33:41 PM

రాజన్న సిరిసిల్ల:(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో(Rajanna Sircilla ) కలకలం రేగింది. వేములవాడ అర్బన్ మండలం నంది కమాన్ సమీపంలో రియాల్టర్ సిరిగిరి రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. రమేష్ గత 20 ఏళ్ల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వేములవాడకు చెందిన వ్యక్తి గాంధీనగర్ నివాసి అయినా ఎద్దండి  దేవరాజు ఈ హత్య చేసినట్లు తెలిసింది. హంతకుడు హతుడి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరి మధ్య ఒక ఫ్లాట్ కు సంబంధించిన భూ వివాదంతోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. హత్య అనంతరం నిందితుడు వేములవాడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. కాగా రమేష్ ను కారు లోనే గొంతు కోసి  చంపాడు. రియల్టర్ హత్య జిల్లాలో సంచలనం మారింది.