20-09-2025 12:32:05 PM
- రావణ కాష్టం నిర్వాణ కు ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): దసరా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు అయిన రావణ కాష్టం నిర్వాణకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్(Former Municipal Chairman) ఆనంద్ గౌడ్ అన్నారు. శనివారం దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలుర మైదానం లో ప్రత్యేకంగా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ అవసరమైన సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, దసరా ఉత్సవ సమితి సభ్యులు తదితరులు ఉన్నారు.