calender_icon.png 20 September, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు అధికారులు, సిబ్బంది ఆయుధాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి

20-09-2025 12:49:46 PM

ఎస్పీ రావుల గిరిధర్ ,

వనపర్తి టౌన్ : వనపర్తి జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో  వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్  అన్నారు. శనివారం  జిల్లా పోలీసు అధికారులు సిబ్బందికి జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి  10వ బెటాలియన్    ఫైరింగ్ రేంజ్ లో ఈ సంవత్సర  3 రోజులు   ఫైరింగ్ ప్రాక్టీసులో(Firing practice) పోలీసులు వారి  విధుల్లో వినియోగించే  ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీసులో చేయించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది, విధినిర్వహణలో  వినియోగించే ఆయుధాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయుధాలను క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలని ఆదేశించారు.

సమయం దొరికినప్పుడు సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు  నిర్వహించాలన్నారు.  పోలీసులు మంచిజీవన విధానాన్ని అవలంబించాలన్నారు.  క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించాలని వనపర్తి జిల్లాకు, తెలంగాణ పోలీసుశాఖకి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్న, డ్యూటీల వద్ద సమస్య ఉన్న, ఆరోగ్య సమస్య ఉన్న ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు  అలవాటుపడి, విధులలో నిర్లక్ష్యంతో, పోలీసుశాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తించరాదని . రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో  స్పెషల్ బ్రాంచ్ సిఐ, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు,  వినోద్, జిల్లాలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.