calender_icon.png 20 September, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు

20-09-2025 01:03:48 PM

హైదరాబాద్: కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఇందిరా మహిళా శక్తి(Indira Mahila Shakti) కార్యక్రమం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, వివేక్, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ... తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. మహిళలకు కుట్టుమిషన్, ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్ లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గతంలో డబ్బుల కోసం మగవారిపై ఆధారపడే పరిస్థితి ఉండేదని చెప్పిన మంత్రి సీతక్క మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకువచ్చిందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.