18 August, 2026 | 7:55 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

సామాజిక న్యాయం కోసమే తెలంగాణ జన సమితి ఆవిర్భావం

11-05-2026 07:06 PM

మెట్‌పల్లి,(విజయక్రాంతి): సామాజిక న్యాయం కోసమే తెలంగాణ జన సమితి ఆవిర్భావించిందని టిజేయస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో టిజెయాస్ పార్టీ నాలుగవ పార్టీ ప్లీనారి సందర్బంగా పట్టణంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రొఫెసర్ కోదండరాం ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు.

ఆ కలల సాకారం, వాటి అమలు కోసమే నాలుగవ పార్టీ ప్లీనారి నిర్వహిస్తున్నాం అని తెలిపారు. హైదరాబాద్ లో ప్లీనారి విజయవంతం కోసం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అత్యధికముగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు పసునూరి శ్రీనివాస్, విద్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శి జిల్లపెల్లి దిలీప్, టిజెయాస్ యువజన విభాగం నియోజకవర్గం ఇంచార్జి వన్నెల శశి, పింజరి రజని కాంత్, విద్యార్థి విభాగం నియోజకవర్గం ఇంచార్జి రాంపల్లి శ్యామ్, మైలారం లక్ష్మణ్, రామగిరి శేఖర్, దగ్గుల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.