17-09-2025 08:20:18 AM
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం(Central government) ఆధ్వర్యంలో పరేడ్ మైదానంలో నేడు తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు(Telangana Liberation Day Celebrations ) నిర్వహించనున్నారు. ముఖ్య అతిధిగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు రాజ్ నాథ్ చేరుకుంటారు. సైనిక అమరవీరుల స్థూపానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ నివాళులర్పించనున్నారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ కళారూపాలను తిలకించనున్నారు. పికెట్ లోని పార్క్ లో మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయీ విగ్రహాన్ని రాజ్ నాథ్ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రులు గజేంద్రసింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ వేడుకలో పాల్గొనున్నారు.