17-09-2025 09:10:58 AM
హైదరాబాద్: అవినీతి తిమింగలం అంబేద్కర్(ADE Ambedkar remanded) ను ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఏడీఈ అంబేడ్కర్ ను చంచల్ గూడ జైలుకు(Chanchalguda Jail) తరలించారు. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ ను ఏసీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిన్న అంబేద్కర్, ఆయన బంధువుల ఇళ్లలో 15 చోట్లు ఏసీబీ సోదాలు చేసింది. అంబేద్కర్ బంధువు ఇంట్లో రూ.2.18 కోట్లను ఏసీబీ అధికారులు(ACB officials) గుర్తించారు. హైదరాబాద్ లో ఆరు ప్లాట్లు, గచ్చిబౌలిలో ఐదంస్తుల భవనం, మరో ఖరీదైన భవనం, వెయ్యి గజాల స్థలం, సూర్యాపేటలో పది ఎకరాల వ్యవసాయ భూమి, అంబేడ్కర్ ఇంట్లో బంగారం, బ్యాంకులో రూ. 78 లక్షలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.