calender_icon.png 17 September, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అది యూరియా కాదు మొర్రో...

17-09-2025 08:27:57 AM

ఊర్లోకి డీసీఎం లోడు రాక.. గ్రామస్తుల భారీ క్యూ లైన్ లు

తీరా చూసి నవ్వుకున్న రైతులు. 

రేగొండ,(విజయక్రాంతి): రైతన్నలకు(farmers) కంటిమీద కునుకు లేకుండా చేస్తూ వారి వ్యవసాయ పనులకు అడ్డుగా నిలుస్తున్న యూరియా కష్టాలు తీరేది ఎన్నడో కానీ.. ఏ ఫర్టిలైజర్ షాప్ దగ్గరైన, ఏ వ్యవసాయ సంఘాల దగ్గరైన ఏ గ్రామానికైనా ఒక డీసీఎం వ్యాన్ పైన పరదా కప్పుకొని లోడుతో వస్తే రాత్రి ఒంటి గంటకైనా రైతులు ఎగబడి డిసీఎం వ్యాన్ వెనుక పరిగెడుతున్నారు. ఈ క్రమంలోనే మండలంలోని తిరుమలగిరి గ్రామానికి బుధవారం ఉదయం 4 గంటల ప్రాంతాన ఒక డీసీఎం వ్యాను పైన పరదా కప్పుకుని ఊరులోకి బయలుదేరింది. ఊరు ప్రారంభ దశలో రోడ్లపై ఉన్న వ్యక్తులు డీసీఎం లోడు యూరియా ఊరిలోకి వస్తుందంటూ ఆ నోట ఈ నోట ప్రచారం చేశారు. దీంతో గ్రామస్తులంతా భారీ ఎత్తున ఆ డీసీఎం లోడు వెనుక పరిగెత్తుతూ భారీ క్యూ లైన్లు కట్టారు.

ఈ డీసీఎం లోడు యూరియా కాదు మొర్రో అని మొత్తుకున్న వినకుండా ఉదయం వారి పనులు చేసుకోకుండా మరి  వందలాదిమంది  లైన్లు కట్టారు. ఒక తిరుమలగిరి గ్రామం నుండే కాక చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా అక్కడికి చేరుకొని క్యూ లైన్ లో నిలుచున్నారు.అది ఒక ఫర్టిలైజర్ షాప్ ముందు ఆగడం యూరియా బస్తాల లోడే అనుకుని ఎవరు ఎంత చెప్పినా వినకుండా అక్కడే నిల్చున్నారు..కానీ షాపు యజమాని డీసీఎం వ్యాను డ్రైవర్ ఈ లోడ్ యూరియా బస్తాలు కాదని పంట పొలాలకు వేసే సి ఎం ఎస్, 20 20 బస్తాల ఎరువుల లోడ్ అని చెప్పిన బస్తాలు దించుతున్న వెనుక వరసలో యూరియా ఉందంటూ ఆ లోడు మొత్తం దింపే వరకు అక్కడే నిల్చుని ఉన్నారు.వ్యాను ఖాళీ అయ్యాక రైతులంతా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. మరి కొందరేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రైతులను ఆగం చేస్తుందని పనులు చేసుకోకుండా షాపుల చుట్టూ తిప్పుతుందని స్థానిక నాయకులను తిట్టుకుంటూ వెళ్లిపోయారు.