17-09-2025 10:13:58 AM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజా పాలన దినోత్సం వేడుకలు(Telangana Praja Palana Dinotsavam) నిర్వహిస్తోంది. ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్నారు. గన్ పార్క్ లో అమరవీరులకు రేవంత్ రెడ్డి నివాళలర్పించారు. పబ్లిక్ గార్డెన్స్ లో ముఖ్యమంత్రి జాతీయజెండా ఆవిష్కరించారు. కళా బృందాలు పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట్ర గీతం ఆలపించాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, కాంగ్రెస్ నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.