calender_icon.png 17 September, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలో పాల్గొన్న రాజ్​నాథ్ సింగ్

17-09-2025 09:52:04 AM

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ(Telangana Liberation Day celebrations) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారిక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. సైనిక అమర వీరుల స్తూపానికి నివాళులర్పించిన రాజ్‌నాథ్ సింగ్  జాతీయ జెండా ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవం వందనం స్వీకరించారు. తెలంగాణలో సెప్టెంబర్ 17 చుట్టూ రచ్చ జరుగుతోంది. నేడు రాష్ట్రంలో రాజకీయంగా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవంగా, జాతీయ సమైక్యతా దినోత్సవంగా బీఆర్‌ఎస్, విమోచన దినోత్సవంగా బీజేపీ వేడుకలు నిర్వహిస్తున్నాయి.