17-09-2025 08:25:47 AM
108 లోనే రాధిక కు నార్మల్ డెలివరీ చేసిన.. ఆశ వర్కర్ లీలమ్మ.
ఆశా లీలమ్మ సేవ పట్ల.. కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం
తుంగతుర్తి, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన నీలం రాధికకు మంగళవారం మధ్యాహ్నం డెలివరీ నొప్పులు రాగా వెంటనే, స్థానిక ఆశా కార్యకర్త బైరు లీలమ్మ 108 ఫోన్ చేసి పిలిపించగా, వారు వచ్చి ఆమెను తీసుకొని, సూర్యాపేట ఏరియా దావకానకు, వెళ్తుండగా మార్గమధ్యంలోనే, నొప్పులు ఎక్కువై, నార్మల్ డెలివరీ, బాబు ప్రసవించింది. దీనితో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రజల కోసం, అనునిత్యం పనిచేస్తున్న ఆశా కార్యకర్త బైరు లీలమ్మకు కుటుంబ సభ్యులు, ఆరోగ్య అధికారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.