17-09-2025 09:19:55 AM
హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు చోట్ల ఐటీ(Income Tax raids) అధికారులు బుధవారం సోదాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ లో బంగారం వ్యాపారి జగదీశ్(Gold merchant Jagadish) ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, సికింద్రాబాద్ లో ఐటీ సోదాలు చేస్తోంది. 15 బృందాలతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు హైదరాబాద్ నగరంలోని పలు చోట్లు సోదాలు చేస్తున్నారు. అటూ వరంగల్ లోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ బంగారం దుకాణాల యజమానులే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయి.