15-07-2025 12:35:28 AM
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): త్వరలో తెలంగాణ పోషకాహార ప్రణాళిక రూపొందిస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. షోషకాహార తెలంగా ణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తుందన్నారు. ఆరోగ్యవంతమై న తెలంగాణ నిర్మాణంలో అందరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సమిష్టి కృషితో నే పౌష్టిక తెలంగాణ సాధ్యపడుతుందన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు దేశానికే ఆదర్శంగా తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు. అంగన్వాడీ సేవల బలోపేతం, చిన్నా రుల్లో పోషకాహార మెరుగుదల, మహిళా స్వ యం సహాయక బృందాల భాగస్వామ్యం వం టి అంశాలపై సోమవారం రాష్ర్టస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎన్‌ఐ ఎన్, ఐఐఎంఆర్, సీఎఫ్‌టీఆర్‌ఐ (మైసూర్), ఎయిమ్స్, ఇక్రిసాట్, యూనిసెఫ్, పలు స్వ చ్చంద సంస్థల ప్రతినిధులు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొని తమ అభిప్రాయలు తెలియ చేశారు.
అంగన్వాడీ లబ్ధిదారులకు రోజుకు 200 మిల్లీ లీటర్ల విజయ పాలు, కిశోర బాలికలకు పల్లీ, తృణ ధాన్య పట్టీలు, వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందిస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని స్పష్టం చేశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, కౌమార బాలికలకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. పోషకార సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
మొబైల్ అంగన్వాడీలు..
నిర్మాణ సౌకర్యం లేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీలను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు.నాక్, జేఎన్‌టీయూ వంటి సంస్థలు మోడల్స్ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వలస కూలీల పిల్లలకు పౌష్టికాహరం అందించేలా మొబైల్ అంగన్వాడీలు నిర్వహిస్తామన్నారు. వారానికి కనీసం రెండు సార్లు ఆయా ప్రాంతాల్లో పోషకాహారన్ని అందిస్తామని తెలిపారు. ఇక అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆసక్తి తెలిపిన నేపథ్యంలో అవసరమైన ప్రోత్సాహక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
సీడ్స్ కిట్ ఆవిష్కరణ
పోషన్ వాటిక కార్యక్రమం కింద నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఆరు రకాల కూరగాయల విత్తనాలతో కూడిన సీడ్స్ కిట్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మొదటి విడతలో 4,500 అంగన్వాడీ కేంద్రాలకు ఈ విత్తనాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో పాలకూర, తోటకూర, మెంతికూర, టమాట, వంకాయ, బెండకాయ విత్తనాలు ఉన్నాయి. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ సృజన, తెలంగాణ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ఐఅండ్‌పీఆర్ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.