15-07-2025 12:37:18 AM
హైదరాబాద్, జులై 14 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుంటే.. రిజర్వేషన్లను అడ్డుకునేం దుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బీసీల కు రిజర్వేషన్లు అమలు చేయబోతున్న చారిత్రాత్మక సందర్భంలో దుర్బుద్ధితో ఆలోచించొద్దని బీజేపీ, బీఆర్‌ఎస్‌లను మంత్రి పొన్నం కోరారు.
సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ అని ల్‌యాదవ్, ప్రభుత్వ విప్ బీర్ల ఐయిలయ్య, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయికుమార్, నూతి శ్రీకాంత్‌గౌడ్‌తో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడా రు. బీజేపీలో ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ మాట చెల్లుబాటు అయితే అసెంబ్లీలో ఆమోదించి, గవర్నర్ సంతకంతో రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేసి 9వ షెడ్యూల్‌లో చేర్పించాలని డిమాండ్ చేశా రు.
బీసీ రిజర్వేషన్లపై న్యాయపరమైన సమస్యలు సృష్టించాలని చూస్తున్నవారికి బీసీలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. చట్టంతో పాటు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగుతున్న తరుణంలో బీసీల పట్ల మీకున్న అనుమానాలేంటని ఆయన ప్ర శ్నించారు. అసెంబ్లీ రన్నింగ్‌లో లేనప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుకు సంబంధం లేదన్నారు.
ఈ ఆర్డినెన్స్ విషయం లో భిన్నాభిప్రాయాలు వచ్చేల బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోందన్నారు. గతంలో మండల్ కమిటీ పేరుతో రిజర్వేషన్లు తీసుకొస్తే.. కమండల్ పేరుతో మనువాద బీజేపీ రిజర్వేషన్లను వ్యతిరేకించిందని ఆయన మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీలోని బీసీ నేతలందరూ వారి పార్టీల అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలన్నారు. పార్టీ పదవుల కోసం బీసీ నాయకులు రిజర్వేషన్లను తాకట్టు పెట్టొద్దన్నారు.