18-09-2025 01:09:23 AM
నాగల్ గిద్ద, సెప్టెంబర్ 17: నాగల్ గిద్ద మండలంలో ప్రధాని నరేంద్ర మోధీ 75వ జన్మదిన వేడుకలు మండల అధ్యక్షులు నాగపురే రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరస్ గుత్తి సామాజిక ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. నాగలగిద్ద గ్రామంలో విశ్వాబ్రహ్మం జయంతిలో బీజేవైఎం మండల అధ్యక్షులు రమేష్ అన్నదానం చేశారు.
వేడుకల్లో ముఖ్యఅతిథిగా సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యదర్శి అరుణ్ రాజ్ శేరికర్ పాల్గొని బిజెపి సత్తా చాటి తె లంగాణలో అధికారంలో వస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో నాగలిగిద్ద మం డల అధ్యక్షులు నాగపురే రాజశేఖర్ ,మండల బీజేవైఎం అధ్యక్షులు రమేష్, సీనియర్ నాయకు లు నాగ్ శెట్టి పాటిల్, గడ్డే కాశీనాథ్, రాందాస్ నాయక్ రాథోడ్, ప్రకాష్ రాథోడ్, హనుమాన్లు, రాజ్ కుమార్,బ్రహ్మం చారి తదితరులు పాల్గొన్నారు.