ఇచ్చిన మాటను నెరవేర్చిన ప్రభుత్వం
అలంపూర్ మార్చి 5: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక్కకొక్కటిగా అమలవుతున్నాయని ఇచ్చిన మాటను నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ అని జిల్లా డిసిసి జనరల్ సెక్రటరీ మహమ్మద్ సిరాజ్ అన్నారు. శుక్రవారం మానవపాడు మండల పరిధిలో చంద్రశేఖర్ నగర్ గ్రామానికి చెందిన మాల ఇకమణికి ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది.
ఈ క్రమంలో నిర్మాణం పూర్తి చేసుకోగా అట్టి ఇందిరమ్మ ఇంటిని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ... పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్ ,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు నాయుడు.




