calender_icon.png 10 May, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీనగర్‌లో 80 మంది తెలంగాణవాసులు

24-04-2025 02:03:20 AM

  1. పహల్గాం కాల్పుల గురించి తెలుసుకుని హోటల్‌కే పరిమితం
  2. తమను స్వస్థలాలకు చేర్చాలని రాష్ట్రప్రభుత్వానికి వేడుకోలు

హైదరాబాద్/మెదక్, ఏప్రిల్23 (విజయక్రాంతి): జమ్మూకశ్మీర్ సందర్శనకు తెలంగాణ నుంచి 80 మంది టూరిస్టులు  శ్రీనగర్ చేరుకున్నారు. మంగళవారం పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పులు జరిపారని సమాచారం అందుకుని వారంతా హోటల్‌లోనే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం వారిని తిరిగి స్వస్థలాలకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.

ఈమేరకు ఓ వీడియో రికార్డు చేసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. హోటల్‌లో చిక్కుకున్న వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు 20 మంది, వరంగల్‌కు చెందిన వారు 10 మంది, మహబూబ్‌నగర్‌కు చెందినవారు 15 మంది, సంగారెడ్డికి చెందిన వారు 10 మంది ఉన్నట్టు సమాచారం. అలాగే మెదక్ పట్టణానికి చెందిన కపిల్ చిట్‌ఫండ్స్ మేనేజర్, ఏజెంట్ రామకృష్ణ కుటుంబాలు సైతం శ్రీనగర్‌కు వెళ్లి అక్కడే ఓ హోట్‌లో చిక్కుకున్నారు. 

ఇంటెలిజెన్స్ అధికారి మనీశ్‌రంజన్ మృతి..

పహల్గాం ఉగ్రవాద కాల్పుల్లో హైదరాబాద్‌లోని కోఠి సబ్సిడరీ ఇంటెలిజెన్‌స బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న మనీశ్‌రంజన్ మృతిచెందారు. ఆయన స్వరాష్ట్రం బీహార్. ఉద్యోగ రీత్యా భార్య ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జమ్మూకశ్మీర్ వెళ్లి మనీశ్ ఉగ్రమూకల చేతిలో చిక్కి మృతిచెందారు. 

ఏపీకి చెందిన ఇద్దరు..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన 26 మందిలో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి కూడా ఒకరు. ఆయన తన భార్య నాగమణితో కలిసి కశ్మీర్ చేరుకున్నారు. టూర్‌లో భాగంగా మంంగళవారం బెహరసన్ లోయ అందాలను వీక్షించేందుకు వెళ్లారు. 

అక్కడ ఉగ్రవా దులు జరిపిన కాల్పుల్లో చంద్రమౌళి మృతిచెందారు. ఏపీలోని కావలి పట్టణానికి చెంది న సోమిశెట్టి మధుసూదన్‌రావు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఉద్యోగ రీత్యా ఆయన బెంగళూరులో స్థిరపడ్డాడు. భార్య కామాక్షి, 16 ఏళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడితో కలిసి అక్కడే స్థిరపడ్డాడు. కుటుంబంతో కలిసి సరదాగా జమ్మూ కశ్మీర్‌కు వెళ్లగా, అక్కడ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మధుసూదన్‌రావు మృతిచెందాడు. చంద్రమౌళి, మధుసూదన్‌రావు మృతదేహాలను స్వస్థలాలకు తీసు కువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.