పండుగలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
03-06-2026 12:26 AM
జండా ఎగరవేసిన మాజీ మేయర్ కావ్య
జవహర్ నగర్, జూన్ 2 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో పండుగలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో మంగళవారం జెండాను ఎగరవేశారు. సీనియర్ నాయకులు కేతమ్మ ఉద్యమ పాటను ఆలపించి అందరిని ఉత్సాహపరిచింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్, నాయకలు సుధాకర్ చారి, బాలరాజ్ పటేల్ ,వెంకటేష్, సిద్ధులు యాదవ్, పరుశురాం ,దిలీప్, అశోక్ ,నరేష్, సతీష్, శ్రీకాంత్, శోభ, మంజుల ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.






