కేసీఆర్ త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం
కేసీఆర్ తెచ్చిన తెలంగాణలోనే రేవంత్ సీఎం అయ్యారు..
కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలకు తప్పని ఇబ్బందులు
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సుదీర్ఘ పోరాటం, త్యా గాల ఫలితంగానే ఆవిర్భవించిందని, కాంగ్రె స్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, రైతులు, మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు.
మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి పార్టీ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాటా ్లడుతూ.. తెలంగాణ కోసం 14 సంవత్సరాల పాటు నిరంతర ఉద్యమం సాగించిన కేసీఆర్ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించా రని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి గులాబీ జెండా చేతపట్టి సిద్దిపేట నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కే. చంద్రశేఖర్ రావు 14 సంవత్సరాల పాటు నిరంతర పోరాటం సాగించి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు తిప్పిందని పేర్కొన్నారు. ఉద్యమంలో అమరులైన శ్రీకాంతాచారి, యాదయ్య, కిష్టయ్య త్యాగాలు చిరస్మరణీయమని, వారి త్యాగ ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షు లు యం.లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, సీనియర్ నాయకులు సుప్రభాత్ రావు, కొ కన్వీనర్లు కృష్ణ గౌడ్, లింగారెడ్డి, కౌన్సిలర్లు బట్టి ఉదయ్ దీపక్ కుమార్, మాయ గంగమని, మాజీ కౌన్సిలర్లు అంకం చంద్రకళ, మాయ మల్లేశం, ఆర్ కె. శ్రీనివాస్, భీమరి కిషోర్, మెదక్, హవెలిఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు యం.అంజాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మెదక్ పట్టణం, మెదక్, హవెలిఘనపూర్ మండల నాయకులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






