మారేడ్‌పల్లి హత్యకేసులో నలుగురు నిందితుల అరెస్ట్
ఏసీబీ పి.గోపాలకృష్ణమూర్తి, ఇన్స్పెక్టర్ వెంకటేష్ నోముల..
సికింద్రాబాద్,జూన్2 (విజయక్రాంతి): సికింద్రాబాద్ లోని మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంజీవయ్య నగర్లో ఆదివారం జరిగిన యువకుడిని మత్తులో హత్య చేసిన సంఘటనలో నలుగురు నిందితులను మంగళవారం మారేడుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ సందర్భంగామల్కాజ్గిరి జోన్, బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి,మారేడుపల్లి ఇన్స్పెక్టర్ వెంకటేష్ నోముల మంగళవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
సంజీవయ్య నగర్ లో ఎదురు ఎదురు ఇండ్లలో నివాసముంటున్న నిందితుడు నిఖిల్, మృతుడు శ్రావణ్(22) కుటుంబం మధ్య గత కొంతకాలంగా ఉన్న వ్యక్తిగత విభేదాలు ,పాత కక్షల కారణంగా హత్యకు దారితీసిందని ఏసిపి గోపాల కృష్ణమూర్తి తెలిపారు. మృతుడు శ్రావణ్ సోదరిని అసభ్యకరంగా వేధించడంతో వారిని మందలించడానికి శ్రావణ్, నిఖిల్ వద్దకు వచ్చి ప్రశ్నించాడు.
దీంతో ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. అప్పటికే జలసాలకు అలవాటు పడి గంజాయి, మద్యం మత్తులో ఉన్న పంగ సాయి నిఖిల్ శ్రావణ్ ను 32 సెంటీమీటర్ల కత్తితో ఎనిమిది పోట్లు పొడిచి తీవ్రంగా గాయపరిచి దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో సంజీవయ్య నగర్ లో నివాసముంటున్న నిందితులు పంగ సాయి నిఖిల్( 22) పై గతంలో మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో ఓ ఒక కేసు నమోదై ఉంది.
ఇదే ప్రాంతంలో ఉంటున్న నందు( 19) , ఇదే ప్రాంతంలో ఉంటున్న మరొక యువకుడు సాయినాథ్ (26), ఇదే ప్రాంతంలో నివాసముంటున్న రమేష్ (20) లను సోమవారం మారేడుపల్లి పోలీసులు అదుపులో తీసుకుని విచారించి అరెస్టు చేసి రిమాండ్ తరలించారు.






