3 June, 2026 | 1:27 AM

అమరుల త్యాగ ఫలితంగానే స్వరాష్ట్రం సిద్ధించింది

03-06-2026 12:06 AM

మంత్రి జూపల్లి కృష్ణారావు 

మహబూబ్ నగర్ జూన్ 2 (విజయక్రాంతి): దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు, ఎంతో మంది ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగ ఫలితంగానే  స్వరాష్ట్రంగా తెలంగాణ సిద్ధించిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక,పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్ కార్యాలయం లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాబి వందన చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జె.అనిరుధ్ రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, ఎస్.పి.డి జానకి, డి.ఎఫ్.ఓ శివ్ ఆశిష్ సింగ్,మేయర్ జి.మమత, డిప్యూట్ మేయర్ సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్,జె.ఎల్.బి హరిప్రియ,డి.ఆర్.ఓ నిర్మల,, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథి మంత్రి జూపల్లి కృష్ణా రావు తో కలిసి జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా,ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి,జె.అనిరుధ్ రెడ్డి,మేయర్ జి.మమత ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ప్రదర్శించారు. జిల్లా ప్రగతిపై మంత్రి ప్రత్యేకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు  ఉన్నారు.