calender_icon.png 2 August, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా నిలుస్తుంది

01-08-2025 12:32:04 AM

  1. 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణం 
  2. 26 లక్షల రైతులకు రుణమాఫీ 
  3. 65 వేల ప్రభుత్వ ఉద్యోగాలు 
  4. నియోజకవర్గంలో 37,962 కొత్త రేషన్ కార్డులు
  5. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుంది
  6. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి 
  7. రేషన్ కార్డు ప్రక్రియ నిరంతరం కలెక్టర్ 
  8. తాసిల్దార్, ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

గోపాలపేట జూలై 31 : కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అన్ని రాష్ట్రాల్లో కల్లా తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా నిలుస్తుందని వనపర్తి ఎమ్మెల్యే మేగా రెడ్డి అన్నారు. గురువారం గోపాలపేట మం డల కేంద్రంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేగా రె డ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పా ల్గొని మాట్లాడారు.

ఇరు మండలాలైనా ఎ దుల గోపాలపేట రేవల్లి మండలాల కు సం బంధించిన రేషన్ కార్డుల లబ్ధిదారులకు రేష న్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.10 ఏళ్ల నుండి కొత్త రేషన్ కా ర్డులు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా200 కోట్ల మహిళలు ప్రయాణాలు జరిగాయని, తెలిపారు.

ఇందిరమ్మ  ప థకం పార్టీలకతీతంగా మంజూరు చేయడం జరిగిందన్నారు. 360 కోట్లు వడ్డీ రుణాలు, 2 రైతు రుణమాఫీ రాష్ట్రంలోని 26 లక్షల రైతులకు రుణాలు మాఫీ చేయడం జరిగిందన్నారు.నిరుద్యోగ యువతకు 65 వేల ఉ ద్యోగాలు, ప్రైవేట్ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు.వనపర్తి జిల్లాలో 37,962 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. వనపర్తి జిల్లాను అభివృద్ధిలో నడిపించడమే నా ధ్యేయం అన్నారు.

గత పాలకుల లాగా తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడే వాడిని కానన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే మేగా రెడ్డి కొత్తగా వచ్చిన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.రేషన్ కా ర్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ... జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. , ఇంకా ఎవరైనా రేషన్ కార్డు రానివారు ఆన్లైన్లో దరఖాస్తు చే సుకోవాలని చెప్పారు.

అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తాసిల్దార్ కార్యాలయాన్ని, గోపాలపేట ఆసుపత్రిని సందర్శించారు. తా సిల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్ సప్లై అ ధికారి కాశీ విశ్వనాథ్, తాహసిల్దార్లు పాం డు, లక్ష్మీ, మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ రఘు, మాజీ ఎంపీపీ సత్యశీల రెడ్డి,  కాం గ్రెస్ పార్టీ మండల  ముఖ్య నాయకులు, రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.