calender_icon.png 1 August, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథేచ్ఛగా కబ్జాలు

01-08-2025 12:31:59 AM

  1. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం 
  2. యోగ్యం కాని భూములపై  కన్ను
  3. అధికారులు, పాలకులు
  4. క్యాతన్‌పల్లిలో విచ్చలవిడిగా ఆక్రమణలు

రామకృష్ణాపూర్, జూలై 31: మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి పురపాలక సంఘంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 7లో ఉన్న ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ భూముల్లో వారు క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూవివరాలను అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఇతరులకు తెలియజేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవటంపై పలు అనుమానాలకు తావి స్తోంది. రైల్వేస్టేషన్ సమీపంలోని సర్వే నెంబర్ 7 ప్రభుత్వ భూమి కబ్జాలకు గురికాకుండా ఉండేందుకు రెవెన్యూ సిబ్బంది గతంలో ప్రభుత్వం సూచిక బోర్డును ఏర్పాటు చేయగా ఓ నాయకుడు దర్జాగా కబ్జా చేసి ఏకంగా ఆ స్థలంలో ఇంటిని నిర్మించాడు.

ప్రభుత్వం భూములపై కన్ను

సాగుకు యోగ్యం కాని శివాజీనగర్ రోడ్డు పక్కన ల్వేగోడను ఆనుకోని ఉన్న సర్వే నెంబర్ 7లోని ప్రభుత్వ భూమిని కొందరు కొన్ని సంవత్సరా-లుగా సాగుచేస్తున్నట్లు, ప్రతి ఏటా చదును చేస్తున్నా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ పట్టింపులేనట్లుగా వ్యవహరించడం ప్రజల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ప్రభుత్వం రాజీవ్ చౌక్ ఏరియాలోని సుమారు మూడు గుంటల పభుత్వ స్థలాన్ని నాయీబాహ్మణ సంఘానికి కేటా-యించారు.

ఇదిలా ఉండగా ఆ పక్కన ఉన్న భూమిని అమరవాదికి చెందిన కొందరు ఆ స్థలం తమదేనంటూ యంత్రాలతో చదును చేయడం, మరి-కొందరు సాగుచేస్తున్నట్లుగా చేసి రోజుల వ్యవధిలోనే రికార్డులు సృష్టించే పనిలో ఉన్నట్లు సమాచా రం. పట్టణంలోని ఒకటో వార్డులో ఇష్టారీతిన కబ్జాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 21వ వార్డు భగత్‌సింగ్‌నగర్ ఏరి యా లో ఉన్న సర్వే నెంబర్ 7 ప్రభుత్వ భూమిని ఓ ప్రజాప-తినిధి యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

నామమాత్రపు పర్యవేక్షణ..

ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నామమాతంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారని,  సూచిక బోర్డులను సైతం కొందరు ఖాతరు చేయకుండా చదును చేస్తున్నపట్టికీ రెవెన్యూ అధి-కారులు పట్టించకోవడం లేదని అంటున్నారు. గతంలో అధికారులు చర్యలు చేపట్టి నిర్మాణాలు తొలగించినా స్థానిక ప్రజాపప్రతినిధుల సపోర్టుతో విచ్చలవిడిగా కబ్జాలు చేస్తున్నారు.

మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధిపథంలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో స్థానిక ఎమ్మెల్యే ఉన్నా.. కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు తలవంపులు తీసుకువస్తున్నారని ప్రజ లు బాహాటంగా చర్చిస్తున్నారు. ఇప్పటిచైనా అధికారులు ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా చడాలని ప్రజలు కోరుతున్నారు. 

కబ్జాలు చేస్తే చర్యలు తీసుకుంటాం: సతీశ్‌కుమార్, తహసీల్దార్, మందమర్రి 

ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సర్వే నెంబర్ 7లో జరుగుతున్న కబ్జాలకు సంబంధించి విష-యాలు మా దృష్టికి రాలేదు.ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదు.