calender_icon.png 12 December, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..

10-12-2025 01:01:24 AM

గద్వాల, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా గద్వాల కలెక్టర్ కార్యాలయంలోని ఆవరణలో 10 అడుగుల ఎత్తు కలిగిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు.

రాష్ట్ర సచివాలయంలో గతేడాది ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాలో ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది జయ జయహే తెలంగాణ గీతాన్ని సామూహికంగా ఆలపించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆర్ అండ్ బి ఈఈ ప్రగతి,  పరిపాలన అధికారి భూపాల్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ లోని వివిధ విభాగాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.