calender_icon.png 12 December, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే రాష్ట్ర ఏర్పాటు

10-12-2025 01:02:36 AM

అలంపూర్, డిసెంబర్ 9: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్‌ఎస్ నాయకుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. దీక్ష విజయ్ దివస్ సందర్భంగా మంగళవారం అలంపూర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...

తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షల సహకారానికి తొలి అడుగుపడ్డ చారిత్రాత్మక రోజని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దేవన్న,సీనియర్ నాయకులు కిషోర్, బెక్కం భాస్కర్ రెడ్డి, నారాయణపురం భాస్కర్ రెడ్డి, రఘు రెడ్డి, విజయ్, ఆనందు తదితరులు పాల్గొన్నారు.