నా మాటగా చెప్పు
20-04-2026 12:00 AM
నవ్వకు ముసిముసిగా నవ్వకు నాడు పౌర్ణమి రోజు కూడా ఇలాగే నవ్వినావు ఏ పున్నమిని చూసిన కన్నెనాగు విషపు నవ్వు గుర్తుకు వస్తూ ఉంటుంది నాడు మా మాటల్ని లాక్కున్నావ్ మనసులను కూడా మూగ చేశావు మరపును కూడా మాయం చేశావు పావులను కదిపినట్టూ కదిపేసావ్ ఆ చకోరానికి నాకోసం ఎదురుచూడమని చెప్పు ఆ స్మృతులన్నీ పౌర్ణమినాటి వెన్నెల్లాగే సజీవంగా ఉన్నాయని చెప్పు మూసివున్న రెప్పల్లో ముచ్చట్లు మూటలు కట్టుకొని తెస్తానని చెప్పు పున్నములకు పాశముండదు వెలుతురుకు నెత్తురు అంటదు ఒంటరి అడవి రాగాలాపన చేస్తోంది కోరసిస్తూ కోటి పౌర్ణములను దాటుకొని వస్తానని చెప్పు.
పర్కపెల్లి యాదగిరి






