02-05-2025 12:00:00 AM
సుధాకర్ చెరుకూరి నేతృత్వంలోని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ ప్రస్తుతం 1990ల నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ క్రైమ్ డ్రామా నిర్మిస్తోంది. ‘హెచ్‌జేక్యూ:- కింగ్ జాకీ క్వీన్’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టితోపాటు శశి ఓదెల, యుక్తి తరేజ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కేకే దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరో నాని ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో దీక్షిత్‌శెట్టి మాట్లాడుతూ.. “దసరా’ తర్వాత ప్రేక్షకులను కలవడం ఆనందంగా ఉంది.
తెలుగు ప్రేక్షకులు నా టాలెంట్‌ను అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో మంచి అవకాశం దొరికింది. నిర్మాత సుధాకర్ సంస్థలో మరెన్నో సినిమాలు చేయాలనుంది’ అన్నారు.
హీరో శశి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది’ అని చెప్పారు. డైరెక్టర్ కేకే మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మీరందరూ సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడుతాను’ అన్నారు. డీవోపీ నాగేశ్, చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.